రిటైర్డ్ జస్టిస్ లైంగిక దాడి కేసులో నివేదిక సమర్పణ
న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వేధింపుల వ్యవహారంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ రోజు రిటైర్డ్ జడ్జ్ వాంగ్మూలాన్ని తీసుకున్న కమిటీ తన తుది నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించింది.